ScriptRule3



Rule 3 :
first impartment  given to “one line order “…all other are cosmetics ,in gradients ….
సినిమా మొత్తాన్ని  వన్ లైన్ ఆర్డర్  లో రాసుకుని ..అలా  సినిమా కధ రాస్తున్నామా లేదా అని  ....సీన్ లు సరిగ్గా  ఉన్నాయా ?  ఒకటికి  పది సార్లు  సరి చూసుకోవాలి .....అలాగే  ప్రేక్షకుడికి  రీచ్  అవ్వాలి ...
బొమ్మరిల్లు :
 " తండ్రి వలన  చిన్న చిన్న ఆశలు ,కోరికలు ,ఆనందాలు  పోగొట్టుకున్న ఒక కొడుకు ..తన ప్రేమ విషయం లో , కెరీర్  విషయం లో ..అలా జరగకూడదని ప్రయత్నం చేయడం ..విజయం  సాధించడం  " ఇదే కధ ...
దీన్ని ఫస్ట్ హాఫ్ ఏమి చేయాలి ? సెకండ్ హాఫ్ ఏమి చేయాలి ...ఇంటర్వల్ బ్లాక్ ఎక్కడ పడాలి అని అలోచించి ..విభజించి రాసుకోవాలి ....రాసుకున్న లైన్ కరెక్ట్  గా  వస్తుందా అని చూసుకున్నాడు -భాస్కర్ ...సో అది హిట్ అయ్యింది ....
అతడు :

“ఒక కాంట్రాక్టు కిల్లర్ ..ఒక కుటుంబం లోకి తప్పని పరిస్థితుల్లో  వెళ్లి ..వాళ్ళకి సహాయ పడుతూ ..పూర్తి గా మారిపోవడం ...”
లైన్ ని త్రివిక్రమ్  కామెడీ గా ,సీరియస్ గా బాగా చెప్పగలిగాడు కాబట్టే  అది క్లాసిక్  హిట్ అయ్యింది ....
ఖుషి :
ఇద్దరు ఇగో వున్న అమ్మాయి ,అబ్బాయి లిద్దరూ  ఎలా ప్రేమలో పడతారు ...ఎలా ప్రేమను తెలియచేసుకుంటారు ?..ఎలా కలుస్తారు ?....”
దీన్నే  కరెక్ట్ గా మలచాడు కాబట్టే అది అంత హిట్ అయ్యింది ....
భారతీయుడు :
అవినీతి ని అంతం చేయాలని --స్వాతంత్రం తెచ్చిన ఒకానొక  ముసలి వ్యక్తి  అవినీతి చేసే వాళ్ళను చంపుతూ ...చివరకు కోవలోకి వచ్చిన కన్న కొడుకుని  చంపడం”
 ..అతని కధ ఏమిటి ? ఎందుకలా మారాడు ? అని స్క్రీన్ ప్లే రాసుకోవడం ..సీన్ లు అల్లుకోవడమే చేయాల్సింది ...
ఒకే ఒక్కడు :
ఒక్కరోజు  ముఖ్యమంత్రి గా ఒక యువకుడు రాష్ట్రాన్ని  పాలిస్తే  ఏమి జరుగుతుంది ?”
...అతని కి పరిస్థితులు  ఎదురౌతాయి ? చివరకు తన జీవితం ఎలా మారిపోతుంది ? అన్నది మిగతా కధ ....
(అలాగని అన్ని సినిమాలకు  వన్ లైన్ ఆర్డర్ రాయలేము ..."అలా మొదలైంది "...దీనికి ఏమి రాయాలి ?  ...కాని  ఒకోసారి స్క్రీన్ ప్లే ...సీన్ లు ..పాటల  వలన  ..లక్ కలసి వస్తుంది ...కాని అన్ని సార్లు కలసి రాదు ..)
ఒక్కడు :
"కబడ్డీ ఆడుకునే కుర్రాడు ..ఒక ఫాక్సనిస్ట్  నుండి ఒక అమ్మాయి ని కాపాడి ,తనని గమ్యాని కి  చేర్చడం "..,…ఐతే  అమ్మాయిని ఎక్కడ  ,ఎలా ఉంచాడు ? ఎలా అన్ని అడ్డంకులు తప్పించుకున్నాడు ..అన్నది కధ లో అల్లుకోవాలి ...
అరుంధతి :
“ఒక జన్మలో  ఒక కముకుడ్ని ..ఒక సబల చంపితే ..వాడు ఆత్మ లాగా  మరొక జన్మ లో పీడిస్తుంటాడు...అలా వచ్చిన ఆత్మ ని మళ్ళీ  పూర్తి గా నాశనం చేయడం "....
ఇక్కడ  మొదటి జన్మ ..రెండవ జన్మ కి తేడాలు ...ఒక జన్మ లో పవర్ ఫుల్ గా వున్న అమ్మాయి ..రెండవ జన్మలో  సామాన్యం గా   పుడుతుంది ..అప్పుడు ఆత్మ ఎలా వేధించింది ? చివరకు ఎలా ఆత్మ ని చంపింది ..అని స్క్రీన్ ప్లే రాసుకోవాలి ...

2 comments:

Venkeymedia said...

very nice...nice Analise..కొత్త గా స్క్రిప్ట్ రాయటం మొదలుపేట్టే వారీ కి చాల విలువైన సమాచారం ఇచ్చారు చాల బాగుందీ సర్

Unknown said...

Sir super sir , meeru direct chestey chudalani Undo sir

Post a Comment