Script Basics


Planting  and Payoff  :

Planting and payoff is a device by which a motif, a line of dialogue, a gesture, behavioral mannerism, costume, prop or any combination of these is introduced into a story and then repeated as the story progresses. In the changed circumstances toward the resolution, the planted information assumes a new meaning and “pays off”.

Examples :
అనుకోకుండా ఒక రోజు : 
Planting :  సినిమా లోనాటకాలు వేస్తాడని’ నర్సింగ్ యాదవ్  ని చూపిస్తారు ...
Payoff  :   క్లైమాక్ష్ సీన్  లో  సడన్  గా నర్సింగ్ యాదవ్  ముని వేషంలో  కనిపించి  పరిస్తితి ని  అదుపు లోకి  తెస్తాడు...

అతడు :
Planting
:
పిస్టల్  లో  ఒక గోలి  వుంచడం  ..మనకు  చెబుతాడు ...
Payoff  :   పిస్టల్  ని వాడి   సోనుసూద్  -మహేష్ బాబు  చేతిలో  మరణిస్తాడు ..
(see “ the Maxican “movie you will find that )

కొత్త బంగారులోకం :
Planting :  ఫస్ట్  హాఫ్ లో ప్రేమికులు  విజిల్  ని కలవడానికి  వాడతారు ...
Payoff  :   సెకండ్ హాఫ్ లో  అదే విజిల్ ని హీరో కలవడానికి  వాడతాడు ...

ప్రేమికుడు
:
Planting :   ప్రభుదేవా  నగ్మా కి ఒక గిలక చేసి ఇస్తాడు  ఫస్ట్ హాఫ్ లో
Payoff  :   అదే గిలక  ద్వార నగ్మా ని కనుక్కుంటాడు

మన్మథుడు
:
Planting :  ఫస్ట్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో "( కాఫీ) ఒకసారి   తాగితే  కదా తెలిసేది " అంటుంది ..
Payoff  :   అదే సెకండ్ హాఫ్ లో సోనాలి బెంద్రే  అదే మాటలు వాడుతుంది ..

నిజం
:
Planting :  ఫస్ట్ హాఫ్ లో  సైకిల్ ని దాచి పెడతాడు ...
Payoff  :   సెకండ్ హాఫ్ లో దాన్ని వాడతాడు ...

చిరునవ్వుతో : 
Planting :  వేణు చప్పట్లుతో  బైక్ తాళాలు  పడటం చూస్తాడు
Payoff  :   అదే  హీరోయిన్  నడుస్తున్నప్పుడు  అదే టెక్నిక్  వాడతాడు

గమ్యం :
Planting :   హీరోయిన్ ఒక కవిత చెబుతుంది .".ప్రేమ ప్రేమను ప్రేమతో "..అని ..
Payoff  :   చివరికి హీరో  క్లైమాక్ష్  లో హీరోయిన్ కి చెప్పి ప్రేమను గెలుస్తాడు ..

ఈగ :
Planting :  సుదీప్ ని చంపడానికి ఈగ  బాంబు పౌడర్  ని ఫిరంగి  లో పెడుతుంది ..
Payoff  :   దాన్నే  చివరికి  వాడి  సుదీప్ ని చంపుతుంది ..

ఎన్నిPlantings and payoffs లు వేసినా   అవి క్యారెక్టర్ లేదా హీరో లేదా హీరోయిన్ కి ఉపయోగ పడాలి ..దాని వలన  మంచి జరగాలి ..ఫీల్ రావాలి...హెల్ప్  జరగాలి ...అలా జరగనప్పుడు  అవి వాడకూడదు ...ముఖ్యం గా ఇవి వాడాలంటే  సృజనాత్మకత  వుండాలి ...తెలివితేటలు వుండాలి ..

If in the first act you have hung a pistol on the wall, then in the following one it should be fired. Otherwise don't put it there.--Anton Chekhov






కధ కి  అవసరం  అయిన కొన్ని వస్తువులని  ప్లాట్ డివైస్  అంటారు ..
వీటి వలన  కధ ముందుకి వెళ్తుంది ..ఒక్కోసారి టెన్షన్ లోకి  వెళ్తుంది ...ఒక్కోసారి ఆనందింప చేస్తుంది ...మంచి ఫీల్  తీసుకు వస్తుంది ...

యమదొంగ :
రాజా ( ఎం.టి .ఆర్ ) ..చిన్నతనం  నుండి ఒక లాకెట్  వుంటుంది ..అది విసిరేసిన  ప్రతీ సారీ మళ్ళీ  రాజా  దగ్గ్గరకు వచ్చి చేరుతుంది ..అదే  ప్రియమణి , ఎం.టి.ఆర్ లను కలుపుతుంది ....అదే  ప్రాణాల్ని సైతం  కాపాడుతుంది ...అందుకే  రాజ మౌళి అంతలా ప్రేక్షకుడి కి గుర్తు వుండాలని  అన్ని సీన్ లు వేసింది ..దానితో ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకుంటారు ...
జగదేక వీరుడు  అతిలోక సుందరి :
 శ్రీదేవి కి ఉంగరం  చిరంజీవి కి మానస సరోవరం  లో దొరుకుతుంది ..దాన్ని చిరంజీవి వేలికి పెట్టుకుంటాడు .. ఉంగరం కోసం  శ్రీదేవి భూలోకం  వస్తుంది ...ఇక దాన్ని ఎంత బాగా వాడుకున్నారో ...దానితో ముడి పడి ఎన్నో సీన్ లు వుంటాయి ...ఒక సాంగ్ ..సరదా ఆటలు కూడా  వుంటాయి ..చివరి వరకు ప్లే  రన్ అవుతుంది ...
జెంటిల్ మాన్ :
ఉంగరమే  చరణ్ రాజ్  కి ఆధారం ...దాని ద్వార హీరో ని పట్టుకోవాలని  ట్రై  చెస్తూనే  వుంటాడు ...చివరకు తన భార్య  శుభశ్రీ  ద్వారా  హీరో అర్జున్ ని  పట్టుకుంటాడు ...దొరికిపోతాడెమో అన్న  టెన్షన్  కల్గిస్తాడు ...
నువ్వొస్తానంటే  నేనొద్దంటానా :
 చాల బాగా  గుర్రం  బొమ్మని వాడారు ..గుర్రం బొమ్మ శ్రీహరి  త్రిష కి చిన్నప్పుడు ఇవ్వడం ..దాని వెనక కారణం  పెట్టారు .. బొమ్మ పగిలితే  సిధార్థ  అతికించి ఇవ్వడం ...త్రిష ప్రేమ లో పడటం ...అది మంటల్లో కాలి పోతుందోనని  సిధార్థ  ప్రాణాలకు తెగించి తేవడం ..శ్రీ హరి మనసు కరగడం ..ఇంత కధనం నడిపారు ..పరుచూరి బ్రదర్స్
మనసంతా నువ్వే :
చిన్నప్పుడు కీ చిన్  లాకెట్  (వాచ్  వున్నది ) హీరోయిన్ --హీరో కి ఇస్తుంది ..అదే వాళ్ళిద్దరూ కలవడానికి ఆధారం ..అది వేరే వాళ్ళ దగ్గరికి  వెళితే మనం టెన్షన్  అవుతాం ..
More examples :
జయం లో -గజ్జెలు ..
మగధీర లో చున్నీ ....
3idiots లో పెన్ ...
పరుగు లో పట్టీ ...
క్షణ క్షణం లో టికెట్ ..
యమలీల లో భవిష్య వాణి  బుక్ ...
రచ్చలో ఆంజేనేయ స్వామి బిళ్ళ దండ ...
ఆర్య లో పట్టీ + కవిత ...
ప్రేమికుడు లో హుక్ ...
ఇలా చాలా సినిమాల్లో  వాడతారు ...
అవసరం  వుంటే  వాడాలి ...లేదా  మానెయ్యాలి ...ఇరికిన్చకండి ..



Time lock  and  Option lock :

Time lock :

ఒక టైం అంటూ చెప్పి - టైం లోగా పని పూర్తి చేయాలి  అని కండిషన్ పెట్టడం .
దీని వలన  క్యారెక్టర్ కి రిస్క్ పెరుగుతుంది .
ఇన్సిడెంట్స్ ఎక్కువ జరగాలి .
ప్రేక్షకుడికి టెన్షన్ వస్తుంది.
స్క్రిప్ట్ ఫాస్ట్ గా ఉండేలా చేసుకోవచ్చు .

Option lock :

టైం లిమిట్ వుండదు. సమస్య వుంటుంది .
 సమస్య నుండి బయట పడాలంటే  రకరకాల దారులు వెదుక్కోవాలి .
వాటినే options అంటారు .
ఇందులో  option లు ఒకొక్కటి  నెగటివ్ గా మారుతుంటే  క్యారెక్టర్ కి రిస్క్ ,టెన్షన్ పెరుగుతుంది .
ప్రేక్షకుడు కూడా  క్యారెక్టర్ తో పాటు ప్రయానించి ఫీల్ అనుభవిస్తాడు .

Examples :

Time lock :

ఒకే ఒక్కడు
 
ఒక్క రోజు ముఖ్యమంత్రి  గా చాల పనులు చేస్తాడు ..హీరో కి టైం వున్నది ఒక్కరోజు . రోజు ఉదయం నుండి  రాత్రి వరకు  చాలా ఇన్సిడెంట్స్  create  చేసారు .ఇది టైం లాక్  కిందకే వస్తుంది .

అరుంధతి

క్లైమాక్స్  లో పశుపతి -అరుంధతి కి ఫలానా టైం కల్లా నాదగ్గరికి వచ్చేలా చేస్తానని కండిషన్ పెడతాడు . ఇక అక్కడ నుండి అరుంధతి, ఫకీర్ పరుగులు పెడతారు . ఇన్సిడెంట్స్ మీద ఇన్సిడెంట్స్ జరుగుతాయి . అరుంధతి క్యారెక్టర్ కి రిస్క్ పెరిగిపోతుంది . ప్రేక్షకుడి కి టెన్షన్  వస్తుంది . దీన్నీ "క్రిష్ " climax  లో గమనిస్తాం.

జగదేక వీరుడు -అతిలోక సుందరి

కార్తిక పౌర్ణమి  ..అంటే నెల రోజుల కల్లా  ఇంద్ర లోకం తిరిగి రావాలని  శ్రీదేవికి  కండిషన్ పెడతాడు  ఇంద్రుడు . ఇక శ్రీదేవి ఉంగరం  కోసం భూలోకం రావడం ... కండిషన్ ని బేస్ చేసుకునే కధ  క్లైమాక్స్ కి వెళ్తుంది .

ప్రయాణం

కధ  ఎయిర్ పోర్ట్ లో జరుగుతుంది . హీరో తన ప్రేమ ను సాధించుకోవడానికి  తనే  టైం లాక్ విధించుకుంటాడు .

అపరిచితుడు :

 సినిమా స్టార్ట్ అవ్వడమే  ఒక రోజు జరిగే వన్నీ చూపిస్తారు .ఇక్కడ డైరెక్టర్  టైం లాక్ తో కధ  రాసుకున్నాడు .

రచ్చ :

 "ఒక నెల లోగా  తమన్నా ని ప్రేమ లోకి దించాలి " అని రామ్ చరణ్ ని పందెం లోకి లాగుతారు . నెల రోజులు టైం లో రామ్ చరణ్  రిస్క్ లు ఎక్కువ చేయాలి.చేస్తాడు .

ఏప్రిల్ 1 విడుదల :

 "ఒక నెల రోజులు అబద్దాలు ఆడ కూడదని " శోభన -రాజేంద్ర ప్రసాద్ కి  కండిషన్ పెడుతుంది . రాజేంద్ర ప్రసాద్ కి కష్టాలు మొదలు అవుతాయి .

మంత్ర :

 క్లైమాక్స్ లో " ఒక్క రాత్రే బంగ్లా లో వుండాలి " అనే కండిషన్ వస్తుంది .హీరో క్యారెక్టర్ కూడా బయపడుతుంది . ప్రేక్షకులు బయపడి చూస్తారు .
 
బొమ్మరిల్లు :

 వారం రోజులు హీరోయిన్  ని తీసుకు వస్తారు ..ప్రకాష్ రాజ్ ఇంట్లోకి ...అదే కండిషన్ .సిద్దార్థ  హాసిని మంచి అమ్మాయి అని ప్రూవ్ చేయాలనీ అనుకుంటాడు .టెన్షన్ స్టార్ట్.

Option lock :

Examples :

అంతః పురం :

 సౌందర్య తన పిల్ల వాడితో పారిపోవాలని  మూడు సార్లు ప్రయత్నిస్తుంది .రక రకాలుగా  ట్రై చేస్తుంది .ఇవే  options . చివరిగా జగపతి బాబు  సహాయం  తో పారిపోతుంది .

గమ్యం :

 హీరోయిన్  ని వెతకడానికి  హీరో బయల్దేరాడు . తెలిసిన వాళ్ళందరిని కలుస్తూ ,అడుగుతూ వెళ్తాడు .  options వున్న వాటిని వాడతాడు . టెన్షన్ లేదు కాబట్టే  వేరే  ఇన్సిడెంట్స్ ,ఫ్లాష్ బ్యాక్ లు వాడారు .

ఐతే

డ్రగ్ మార్కెట్ -డాన్  ని పట్టుకున్న తర్వాత  నలుగురు కుర్రాళ్ళు రక రకాలుగా  డబ్బు కోసం ప్రయత్నిస్తారు .వీటినే options  అంటారు ...

మర్యాద రామన్న

సునీల్  వెళ్లి ,తన మీద పగ తో వున్నా విలన్స్  ఇంట్లో పడతాడు . రకరకాల options  తో ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తాడు .

ఛాలెంజ్ :
 హీరో చిరంజీవి డబ్బు సంపాదించడానికి  చాల రకాలు ట్రై చేస్తూ  చివర్లో  సక్సెస్  అవుతాడు .
(ఇందులో  స్టార్టింగ్ లో రావు గోపాల రావు  "టైం లాక్ " విధిస్తాడు )

అరుణ చలం :
 
ముప్పై  రోజుల్లో మూడు వందల కోట్లు కర్చు పెట్టాలి .అది కండిషన్ లాక్ ..
ఇక్కడ రజని కాంత్ -ఆప్షన్ లాక్ ఫాలో  అవుతాడు . రేస్ లు, సినిమా లో పెట్టిన డబ్బు తిరిగి వచ్చి  ఇంకా డబ్బు పెరిగి పోతుంది ..చివరి ఆప్షన్ రాజకీయాల్లోకి  దిగుతాడు ..సక్సస్  కొడతాడు .


గమనించారా ..

టైం లాక్ విధించిన సినిమా లో స్క్రిప్ట్ ఫాస్ట్ గా  చేసుకోవడానికి ఉపయోగ పడింది .
ఆప్షన్ లాక్  సినిమాల్లో స్క్రిప్ట్  స్లో గా వుంటూ ,ఫీల్ గుడ్ కి దగ్గరగా ఉపయోగ పడింది .

Condition :

1.టైం లాక్ తో స్టార్ట్ చేసి ఆప్షన్ లాక్ లోకి వెళితే
Options  తో టైం వేస్ట్ చెయ్యకూడదు ..
మొదట  ఫెయిల్ ..రెండవసారి సగం సక్సస్ ..మూడవసారి సక్సస్ ..కావాలి ..లేదా  బోర్ కొడుతుంది ..examples : తథాస్తు ,మనోరమ (తెలుగు )

2.బోర్ కొట్టకుండా వుండాలంటే  కధ లో క్యారెక్టర్ ద్వార మలుపులు సృష్టించాలి..లేదా ఇన్సిడెంట్స్  ఎక్కువగా ప్లాన్ చేసుకోవాలి . examples : టాక్సీ నెంబర్ 9211  ..గమ్యం

Conflict
A struggle between opposing forces in a story or play, usually resolved by the end of the work. The conflict may occur within a character as well as between characters. ReadMore>>.

2 comments:

Unknown said...

Hi sir how to cinema script on papar dialanguae and action movement , mainly script writing on paper please upload on video with same story, i hope early
response thinking sir

Eduhealth360 said...

very usefull work sir,thank u so much for ur contribution for us..thanks a lot

Post a Comment